Ramesh Jarkhiholi: కర్ణాటక మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో యువతి అదృశ్యం!

Lady Behind Karnataka Minister Videos Missing
  • మంగళవారం విడుదలైన వీడియోలు
  • రాజీనామా చేసిన కర్ణాటక మంత్రి
  • యువతి కోసం గాలిస్తున్న పోలీసులు
కర్ణాటకలో తీవ్ర కలకలం రేపిన మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియోలో కనిపించిన యువతి ఇప్పుడు అదృశ్యం కావడం సంచలనమైంది. ఆమె ఎక్కడ ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. ఆమె మొబైల్ ఫోన్ నంబర్ కూడా లభ్యం కాలేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. వీరిద్దరి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో వాటిని  ఆపేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

మంగళవారం నాడు రమేశ్, సదరు యువతి ఏకాంత వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై విమర్శలు వెల్లువెత్తగా, ఆయన తన పదవికి రాజీనామా కూడా చేశారు. ఓ శాసన సభ్యుడి ప్రోద్బలంతోనే సదరు యువతి రమేశ్ పై వలపు వల విసిరిందని రమేశ్ అనుకూల వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రహస్యంగా వీడియోలు చిత్రీకరించారని అంటున్నాయి.

ఏది ఏమైనా దాదాపు ఏడాది కాలంగా రమేశ్, ఆ యువతి మధ్య వివాహేతర బంధం నడుస్తోందని పోలీసులు గుర్తించారు. ఆ యువతి ఆచూకీ లభిస్తే, పూర్తి వివరాలు బయటకు వస్తాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
Ramesh Jarkhiholi
Karnataka
Secret Videos
Missing

More Telugu News