తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ!

05-03-2021 Fri 08:28
  • నిన్న 50 వేల మంది భక్తులకు పైగా దర్శనం
  • హుండీ ద్వారా రూ. 295 కోట్ల ఆదాయం
  • సరిపడా ప్రసాదాలను అందిస్తున్నామన్న టీటీడీ
Rush in Tirumala

ఏడుకొండలపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని 50 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ. 2.95 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు ప్రకటించారు. సుమారు 25 వేల మంది తలనీలాలు సమర్పించారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి వచ్చే వారికి ప్రత్యేకంగా దర్శనం టికెట్లను విక్రయిస్తుండటంతో, ఆ కోటా విడుదలైన గంటల వ్యవధిలోనే ముగిసిపోతుండటం గమనార్హం. ఇక కొండపైకి వచ్చే భక్తులకు సరిపడా ప్రసాదాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.