నూజివీడులో మూడుకాళ్లతో జన్మించిన శిశువు!

05-03-2021 Fri 08:13
  • మేనరికమే కారణమన్న ఆసుపత్రి సూపరింటెండెంట్
  • మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలింపు
  • శిశువు ఆరోగ్యంగానే ఉందన్న వైద్యులు
Baby Born With Three Legs In Nuziveedu Hospital

నూజివీడు ఏరియా ఆసుపత్రిలో గురువారం వింత శిశువు జన్మించింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని శెట్టివానిపాలేనికి చెందిన వెంకటేశ్వరమ్మ నెలలు నిండడంతో ఆసుపత్రిలో చేరింది. గురువారం ఆమెకు మూడు కాళ్లున్న ఆడ శిశువు జన్మించింది. వెంకటేశ్వరమ్మ, ఆమె భర్త మోహనరావులది మేనరికమని, జన్యులోపం కారణంగానే శిశువు ఇలా మూడు కాళ్లతో జన్మించిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రసింగ్ తెలిపారు. శిశువు ఆరోగ్యంగానే ఉందని, మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్టు పేర్కొన్నారు.