సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

05-03-2021 Fri 07:25
  • మెగా హీరో సినిమాలో 'బిగ్ బాస్' భామ 
  • రానా 'అరణ్య'కు బాబాయ్ వాయిస్ ఓవర్
  • రాజమండ్రి పరిసరాలలో చైతు 'థ్యాంక్యూ'
Ariana Glory plays key role in Kalyan Devs film

*  యూ ట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు చేసే అరియానా గ్లోరీ తెలుగు 'బిగ్ బాస్ 4' షో ద్వారా ఒక్కసారిగా పాప్యులర్ అయిపోయింది. దీంతో ఈ భామకు ఇప్పుడు సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో  తాజాగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం అరియానాకు వచ్చింది.

*  రానా దగ్గుబాటి హీరోగా ప్రభు సోలోమన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అరణ్య' సినిమాలో సీనియర్ నటుడు వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రానా తండ్రి పాత్రకు వెంకీ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. 
*  'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'థ్యాంక్యూ'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా రాజమండ్రి పరిసరాలలో జరుగుతోంది.