నా అరెస్టుకు కుట్ర చేస్తున్నారు: లోక్ సభ స్పీకర్ కు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

04-03-2021 Thu 18:08
  • ఈ నెల 1న ప్రివిలేజ్ మోషన్ నోటీసులు
  • రఘురామ ఫిర్యాదును స్వీకరించిన లోక్ సభ కార్యాలయం
  • ఫిర్యాదును హోంశాఖకు పంపిన వైనం
  • 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
Raghurama Krishnaraju complains to Lok Sabha speaker

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై నరసాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గతకొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. తరచూ వైసీపీ ప్రభుత్వ విధానాలపైనా, వైసీపీ పెద్దలపైనా విమర్శలు గుప్పించే రఘురామకృష్ణరాజు ఈ నెల 1న ఏపీ డీజీపీపైనా, మరికొందరు ఇతరులపైనా లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు. తనను నియోజకవర్గానికి రానివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు.

రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఎంపీ చేసిన ఫిర్యాదును కేంద్ర హోంశాఖ ముందుంచింది. అంతేకాకుండా, దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి వివరణ తీసుకుని 15 రోజుల్లోనే నివేదిక సమర్పించాలని ఆదేశించింది.