దూకుడుకు బ్రేక్.. నష్టాలలో స్టాక్ మార్కెట్లు!

04-03-2021 Thu 16:37
  • మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట
  • లాభాల స్వీకరణకు దిగిన మదుపరులు
  • 598 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
  • నిఫ్టీకి 164 పాయింట్ల నష్టం
Stock markets close in red today

గత మూడు రోజులుగా లాభాలలో కొనసాగిన మన స్టాక్ మార్కెట్లు ఈవేళ నష్టాలలో పడ్డాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఉదయం నుంచీ మార్కెట్లు నష్టాలతోనే కొనసాగాయి. ఒకానొక దశలో 900 పాయింట్ల వరకు సెన్సెక్స్ కు నష్టం వచ్చింది. ఆ తర్వాత కాస్త రికవరై.. చివరికి సెన్సెక్స్ 598 పాయింట్ల నష్టంతో 50846 వద్ద.. నిఫ్టీ 164 పాయింట్ల నష్టంతో 15080 వద్ద ముగిశాయి.

ఈ క్రమంలో ఆల్ట్రా టెక్ సిమెంట్, టాటా పవర్, అదానీ పోర్ట్స్, ఫెడరల్ బ్యాంక్, గ్రాసిమ్, ఎమ్మారెఫ్ తదితర షేర్లు లాభాలు పొందగా.. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్ సెర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాలపాలయ్యాయి.