ఉప్పెన యూనిట్ సభ్యులతో అల్లు అర్జున్.. ఫొటోలు ఇవిగో!

04-03-2021 Thu 15:48
  • ఇటీవల విడుదలైన ఉప్పెన
  • బాక్సాఫీసు వద్ద విజయం
  • ఉప్పెన చిత్రాన్ని నిన్న వీక్షించిన అల్లు అర్జున్
  • చిత్రబృందానికి అభినందనలు
Uppena unit members met Allu Arjun

టాలీవుడ్ లో ఇటీవలే విడుదలై విజయాన్నందుకున్న చిత్రం ఉప్పెన. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటించిన ఉప్పెన చిత్రానికి విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి.

కాగా, టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ ఉప్పెన చిత్రాన్ని నిన్న వీక్షించారు. సినిమా చాలా బాగుందంటూ చిత్రబృందాన్ని అభినందించారు. దర్శకుడ్ని, హీరోని ప్రత్యేకంగా ప్రశంసించారు. చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, హీరో వైష్ణవ్ తేజ్, నిర్మాతలు బన్నీని కలిసినప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్రబృందం స్టైలిష్ స్టార్ కు ఓ మొక్కను బహూకరించింది.