సివిల్ జడ్జి నియామకాలకు అనుభవం అవసరంలేదు: ఏపీ హైకోర్టు తీర్పు

04-03-2021 Thu 16:08
  • నియామక నోటిఫికేషన్ పై 50కి పైగా వ్యాజ్యాలు
  • మూడేళ్ల న్యాయవాద అనుభవం అక్కర్లేదన్న హైకోర్టు
  • పాత నోటిఫికేషన్ కొట్టివేత
  • సవరణతో కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశం
High Court verdict on civil judge recruitment notification

ఆంధ్రప్రదేశ్ లో సివిల్ జడ్జి నియామకాల నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. సివిల్ జడ్జి నియామక నోటిఫికేషన్ పై 50కి పైగా వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో హైకోర్టు విచారణ నిర్వహించింది.  సివిల్ జడ్జి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుభవం అక్కర్లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మూడేళ్ల న్యాయవాద అనుభవంతో పనిలేదని వివరించింది. అనుభవం అవసరంలేదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది.

ఈ మేరకు సివిల్ జడ్జి పరీక్షలకు ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. అంతేకాదు, ఇటీవల జరిపిన రాతపరీక్షలను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సవరణతో మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని రిక్రూట్ మెంట్ రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.