ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో విశాఖకు 15వ స్థానం... 24వ స్థానంలో హైదరాబాద్

04-03-2021 Thu 15:21
  • ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితా విడుదల
  • ప్రథమస్థానంలో బెంగళూరు
  • రెండు, మూడు స్థానాలలో పూణే, అహ్మదాబాద్
  • 10 లక్షల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో తిరుపతికి రెండోస్థానం
Ease of Living cities index

కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలోని ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీ తూర్పు తీర ప్రాంత నగరం విశాఖ 15వ స్థానంలో నిలవగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచింది. విజయవాడకు 41వ స్థానం దక్కింది.

కేంద్రం రూపొందించిన ఈ ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో గార్డెన్ సిటీ బెంగళూరు ప్రథమస్థానం కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో పూణే, అహ్మదాబాద్ నగరాలు ఉన్నాయి. మునుపటి జాబితాలో నెంబర్ వన్ గా ఉన్న పూణే ఈసారి రెండోస్థానానికి పడిపోయింది. ఇక, 10 లక్షల లోపు జనాభా ఉన్న నివాసయోగ్య మున్సిపాలిటీల్లో తిరుపతికి రెండో స్థానం, కాకినాడకు నాలుగో స్థానం లభించాయి. 10 లక్షల పైన జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో విశాఖకు 9వ స్థానం దక్కింది.