‘రాఫెల్​’ను పోలిన వాహనం ఆవిష్కరణ.. ఇదిగో వీడియో

04-03-2021 Thu 14:21
  • విమానం ఎక్కలేని వారి కోసం స్పెషల్
  • తయారు చేసిన బఠిండా ఆర్కిటెక్ట్
  • రాఫెల్ స్ఫూర్తితో తయారు చేశానని వెల్లడి
Architect Builds Jet Shaped Vehicle Names It Punjab Rafale

చాలా మందికి యుద్ధ విమానం ఎక్కాలనుంటుంది. కానీ, ఎక్కలేరు. ఆ అదృష్టం కొద్ది మందికే దక్కుతుంది. మరి, మిగతా వారి పరిస్థితేంటి? ఆ ఆలోచనే వచ్చింది బఠిండాలోని రామా మండికి చెందిన ఆర్కిటెక్ట్ రాంపాల్ బేనివాల్ కు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. రాఫెల్ యుద్ధ విమానాలే స్ఫూర్తిగా ‘పంజాబ్ రాఫెల్’ను తయారు చేశాడు. అయితే, ఆ విమానంలాగా ఈ బండి ఎగరలేదనుకోండి.

ఆ బండికి తన పేరే పెట్టుకున్నాడు. రాం పాల్ ఎయిర్ లైన్ అని బానెట్ మీద రాయించాడు. ఫోన్ నంబర్లను రాశాడు. ఈ బండిని తయారు చేసేందుకు రూ.3 లక్షల దాకా ఖర్చు పెట్టాడట. గంటకు 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ఈ పంజాబ్ రాఫెల్ ప్రయాణిస్తుందట.

అంతేకాదు.. కొందరు పిల్లలను అందులో ఎక్కించుకుని ట్రయల్ రన్ కూడా చేశాడు. త్వరలోనే సాంస్కృతిక పార్కులో తాను తయారు చేసిన వాహనాన్ని ప్రదర్శనకు ఉంచుతానని చెప్పాడు. విమానం ఎక్కాలని ఉన్నా.. ఆర్థిక స్తోమత లేక ఆగిపోయే వారి కోసం దీనిని తయారు చేశానన్నాడు. రాఫెల్ యుద్ధ విమానాల స్ఫూర్తితో పంజాబ్ రాఫెల్ ను తయారు చేశానన్నాడు.