మాగంటి బాబు కుమారుడి ఆత్మహత్యా యత్నం... పరిస్థితి విషమం!

04-03-2021 Thu 07:33
  • నిద్రమాత్రలు మింగిన రాంజీ
  • విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తరలింపు
  • ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్న వైద్యులు
Sucide Attempt by Ex MP Maganti Babu Son Ramji

ఏలూరు మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత మాగంటి బాబు కుమారుడు రాంజీ ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రస్తుతం చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. గత రాత్రి రాంజీ నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున రాంజీని చూసిన కుటుంబీకులు, అతన్ని హుటాహుటిన విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అతనికి ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి. రాంజీ పరిస్థితి విషమంగా ఉందని, కొన్ని గంటలు గడిస్తేనే అతని స్థితిపై ఓ అవగాహన వస్తుందని డాక్టర్లు అంటున్నారు. రాంజీ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరింత సమాచారం తెలియాల్సి వుంది.

కాగా, గతంలో రాంజీపై పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. వరసకు వదిన అయ్యే మహిళకు అసభ్యకరమైన మెసేజ్ లను పంపించాడన్న కేసు విషయంలో విచారణ కొనసాగుతోంది. తనకు జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవి కావాలని కూడా రాంజీ గతంలో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే.