Corona Virus: కొవిడ్ వచ్చి తగ్గినా.. వెంటాడుతున్న సమస్యలు.. 110 రోజుల వరకు ఇబ్బందులు!

  • 18,251 అధ్యయనాల్లో వెల్లడి
  • 44 శాతం మందిలో వేధిస్తున్న తలనొప్పి
  • రుచిన గుర్తించలేకపోతున్న 23 శాతం మంది
  • 6 శాతం మందిలో ఎర్రబడుతున్న కళ్లు
Difficulties that do not leave after corona

కరోనా మహమ్మారి వచ్చి తగ్గినప్పటికీ తదనంతర సమస్యలు మాత్రం వదలడం లేదు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆ బాధలు 14 రోజుల నుంచి 110 రోజుల వరకు అంటిపెట్టుకునే ఉంటున్నట్టు అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో నిర్వహించిన 18,251 అధ్యయనాలు చెబుతున్నాయి.

వైరస్ నుంచి బయటపడిన వారిలో 58 శాతం మంది చిన్న పనికే అలసిపోతుండగా, 44 శాతం మందిలో తలనొప్పి వేధిస్తోంది. 80 శాతం మంది ఒకటికి మించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. 47,910 మంది కరోనా రోగులకు అందించిన చికిత్సలను అధ్యయనం చేయగా ఈ విషయాలు వెలుగుచూశాయి. 17-87 ఏళ్ల మధ్య వయస్కులను ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు.

అధ్యయనంలో వెల్లడైన దానిని బట్టి.. 25 శాతం మందిలో జుట్టు రాలిపోవడం, 24 శాతం మందిలో శ్వాస తక్కువసార్లు తీసుకోవడం, 21 శాతం మందిలో శ్వాస ఎక్కువసార్లు తీసుకోవాల్సి రావడం, 21 శాతం మందిలో వాసన తెలియకపోవడం, 19 శాతం మందిలో దగ్గు, 11 శాతం మందిలో జ్వరం, 23 శాతం మందిలో రుచిని గుర్తించలేకపోవడం, 16 శాతం మందిలో జ్ఞాపకశక్తి సన్నగిల్లడం, మూడు శాతం మందిలో కళ్లు తిరగడం, 6 శాతం మందిలో కళ్లు ఎర్రబడడం తదితర సమస్యలను అధ్యయనకారులు గుర్తించారు.

More Telugu News