సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

04-03-2021 Thu 07:17
  • 'ఆచార్య' షూటింగులో పూజ హెగ్డే
  • వెరైటీ ప్రేమకథలో హాస్యనటి శ్రీలక్ష్మి
  • 'శాకుంతలం'కి నో చెప్పిన ఈషా రెబ్బ    
Pooja Hegde joins Acharya shoot

*  చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాలలోని గోదావరీ తీరంలో జరుగుతోంది. చరణ్ పక్కన కథానాయికగా నటిస్తున్న పూజ హెగ్డే కూడా నిన్న ఈ చిత్రం షూటింగులో జాయిన్ అయింది.
*  నిన్నటితరం ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి, యువనటుడు పార్వతీశం జంటగా నటిస్తున్న 'సావిత్రి W/O సత్యమూర్తి' చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో మొదలైంది. అరవై ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడిన పాతికేళ్ల కుర్రాడి కథగా ఇది తెరకెక్కుతోందని చిత్ర దర్శకుడు చైతన్య కొండ తెలిపారు. 45 రోజుల్లో షూటింగును పూర్తిచేస్తామని చెప్పారు.
*  సమంత ప్రధానపాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న 'శాకుంతలం' చిత్రంలో కీలక పాత్రకు ఈషా రెబ్బాను తీసుకున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, పారితోషికం కారణంగా ఈషా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదని తెలుస్తోంది.