Chittoor District: పలమనేరులో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. మునిసిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లే యత్నం

  • వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపణ
  • వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట
  • ఇరు వర్గాలను దూరంగా పంపేసిన పోలీసులు
tdp vs ysrcp Tensions erupted in palamaner

మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల ఉపసంహరణలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఇరు వర్గాలు తోపులాటకు దిగాయి. ఒక దశలో మునిసిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించగా, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో గొడవ మరింత ముదిరింది.

అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో కార్యాలయంలోకి ఎవరినీ పంపబోమని పోలీసులు హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఇరు పార్టీల నేతలను పోలీసులు అక్కడి నుంచి దూరంగా పంపించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పలమనేరు పురపాలికలో 26 వార్డులకు గాను 18 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

More Telugu News