కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగ ఫలితాలు వెల్లడించిన భారత్ బయోటెక్

03-03-2021 Wed 17:33
  • కొవాగ్జిన్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్
  • దేశీయ వ్యాక్సిన్ గా గుర్తింపు
  • భారత్ లో అత్యవసర వినియోగం
  • అదే సమయంలో  మూడో దశ క్లినికల్ పరీక్షలు
  • 81 శాతం సామర్థ్యం చూపినట్టు భారత్ బయోటెక్ వెల్లడి
Bharat Biotech reveals third phase clinical trials of Covaxin

దేశీయంగా అభివృద్ధి పరిచిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను ఓవైపు వినియోగిస్తుండగానే, మరోవైపు మూడో దశ క్లినికల్ పరీక్షలను కూడా నిర్వహించారు. తాజాగా ఈ మూడో దశ ప్రయోగ ఫలితాలను కొవాగ్జిన్ సృష్టికర్త భారత్ బయోటెక్ వెల్లడించింది.

ఈ దశలో 25,800 మంది వలంటీర్లపై పరీక్షలు జరిపామని వివరించింది. ఐసీఎంఆర్ సహకారంతో నిర్వహించిన ఈ మూడో దశ దేశంలోనే అతిపెద్ద క్లినికల్ పరీక్షల ప్రక్రియ అని పేర్కొంది. ఈ దశలో కొవాగ్జిన్ క్లినికల్ సామర్థ్యం 81 శాతం అని సంస్థ తెలిపింది.

మునుపటి దశలతో పోల్చితే ఈ దశలో ఫలితాలు మెరుగయ్యాయని వివరించింది. తుది విశ్లేషణ నిమిత్తం క్లినికల్ ట్రయల్స్ ను కొనసాగిస్తామని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.