Ramesh Jarkiholi: రాసలీలల ఆరోపణల నేపథ్యంలో.. కర్ణాటక మంత్రి రాజీనామా

  • జల వనరుల మంత్రి రమేశ్ జర్కిహోళిపై తీవ్ర ఆరోపణలు
  • ఉద్యోగం పేరిట లైంగికంగా వాడుకున్నారంటూ ఓ మహిళ వ్యాఖ్యలు
  • కలకలం రేపిన వీడియో ఆధారాలు
  • సీఎంకు రాజీనామా లేఖ పంపిన రమేశ్ జర్కిహోళి
 Karnataka minister Ramesh Jarkiholi resigns

కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోళి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఉద్యోగం పేరిట ఓ మహిళతో రాసలీలలు నెరిపిన మంత్రి అన్నివైపుల నుంచి విమర్శలు, ఒత్తిళ్లు తీవ్రం కావడంతో పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగం ఆశచూపిన మంత్రి తనను లైంగికంగా వాడుకున్నారని ఆ మహిళ ఆరోపించడమే కాదు, అందుకు తగిన వీడియో ఆధారాలను కూడా వెల్లడి చేయడంతో కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది.

అయితే తన చిత్రాలను మార్ఫింగ్ చేసి ఈ వీడియో రూపొందించారని నిన్న వ్యాఖ్యానించిన మంత్రి రమేశ్ జర్కిహోళి... తప్పనిసరి పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు సీఎం యడియూరప్పకు రాజీనామా లేఖను పంపించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, వాటిపై దర్యాప్తు చేయాలని రమేశ్ కోరారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఆరోపణలు వచ్చాయి కాబట్టి నైతిక బాధ్యతతో రాజీనామా చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు.

More Telugu News