నటి ఫిర్యాదు నేపథ్యంలో కెమెరామన్ శ్యామ్ కె నాయుడుకు సుప్రీంకోర్టు నోటీసులు

03-03-2021 Wed 15:18
  • శ్యామ్ కె నాయుడు తనను మోసం చేశాడంటున్న నటి శ్రీసుధ
  • గతంలో బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు
  • ఆ కేసులో కెమెరామన్ కు బెయిల్
  • బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన నటి
Apex court issues notice to Shyam K Naidu

పెళ్లి పేరుతో సహజీవనం చేసి మోసం చేశాడంటూ టాలీవుడ్ నటి శ్రీసుధ ప్రముఖ కెమెరామన్ శ్యామ్ కె నాయుడుపై గత కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన శ్రీసుధ... ఈ కేసులో శ్యామ్ కె నాయుడుకు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఆమె పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ కేసులో కెమెరామన్ శ్యామ్ కె నాయుడుకు నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది. ఇటీవల శ్రీసుధ కారు విజయవాడలో ప్రమాదానికి గురయింది. శ్యామ్ కె నాయుడు తనను చంపేందుకు ప్రయత్నించాడంటూ ఆరోపించిన శ్రీసుధ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.