గంటా శ్రీనివాస‌రావు వైసీపీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది: విజ‌య‌సాయిరెడ్డి

03-03-2021 Wed 13:30
  • వైసీపీలో చేరిన గంటా అనుచ‌రుడు కాశీ విశ్వ‌నాథ్
  • కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజ‌య‌సాయి 
  • జ‌గ‌న్ పాల‌న చూసే చాలా మంది చేరుతున్నారు
  • గంటా శ్రీనివాస‌రావు కొన్ని ప్రతిపాద‌న‌లు పంపారు
ganta will join in ycp says vijaya sai

మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు అనుచ‌రుడు, టీడీపీ నేత కాశీ విశ్వ‌నాథ్ ఈ రోజు విశాఖ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో పాటు ప‌లువురి స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఆయ‌న‌ను కండువా క‌ప్పి పార్టీలోకి  విజ‌య‌సాయిరెడ్డి ఆహ్వానించారు. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి అవంతి శ్రీనివాస్ హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా కొన‌సాగుతోన్న సీఎం వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న చూసే చాలా మంది వైసీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. గంటా శ్రీనివాస‌రావు త‌మ‌కు కొన్ని ప్రతిపాద‌న‌లు పంపారని ఆయ‌న చెప్పారు.

వైఎస్ జ‌గ‌న్ ఆమోదం త‌ర్వాత గంటా శ్రీనివాస‌రావు వైసీపీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. కాగా, వైసీపీలో గంటా శ్రీనివాస‌రావు చేర‌తార‌ని కొన్ని నెల‌లుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే.