సరసమైన ధరలో... రూ. 54 వేలకే బజాజ్ ప్లాటినా కొత్త వర్షన్!

03-03-2021 Wed 12:14
  • 102 సీసీ వేరియంట్ గా బైక్
  • ఎక్స్ షోరూం ధర రూ. 53,920
  • ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్లలో తక్కువ ధరన్న బజాజ్
New 100 CC Bike from Bajaj Under 54000 Rupees

ఇండియాలో అత్యధికంగా వాహనాలను విక్రయిస్తున్న సంస్థల్లో ఒకటైన బజాజ్, తమ హై సేల్స్ బ్రాండ్ ప్లాటినాలో కొత్త వేరియంట్ ను చౌక ధరలో విడుదల చేసింది. 102 సీసీ 'ప్లాటినా 100 ఈఎస్'ను బీఎస్ 6 వేరియంట్ లో, ఎలక్ట్రిక్ స్టార్ట్ తో రూ. 53,920కి అందిస్తామని ప్రకటించింది.

దేశంలో లభించే ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్లలో అతి తక్కువ ధరకు లభించేది తమ బైకేనని ఈ సందర్భంగా బజాజ్ పేర్కొంది. సుదీర్ఘ ప్రయాణాలను ఇది సౌకర్యవంతం చేస్తుందని, స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ సస్పెన్షన్ దీని ప్రత్యేకతని వెల్లడించింది.

ఈ సెగ్మెంట్ లో 70 లక్షల బైక్ లను ఇప్పటికే తాము విక్రయించామని వెల్లడించిన బజాజ్ మార్కెటింగ్ హెడ్ సుందరరామన్, ఈ బైక్ కూడా కస్టమర్ల ఆదరణను చూరగొంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే బైక్ వేరియంట్ కిక్ స్టార్ట్ మోడల్ గా రూ. 51,667 (ఎక్స్ షోరూం - న్యూఢిల్లీ) ధరలో అందుబాటులో ఉంటుందని అన్నారు.