కుమురంభీం జిల్లాలో రెండు వ‌ర్గాల పరస్పర దాడి.. ఒక‌రి మృతి

03-03-2021 Wed 11:38
  • మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు
  • క‌ర్జీ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు
  • భూత‌గాదాల‌తో రెండు కుటుంబాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌
ruckus in kumuram bheem dist

కుమురంభీం జిల్లాలోని ద‌హేరాం మండ‌లం క‌ర్జీ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రెండు వ‌ర్గాలు క‌ర్ర‌ల‌తో ప‌రస్ప‌రం దాడి చేసుకుని అల‌జ‌డి రేపాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్దరికి తీవ్ర‌గాయాల‌య్యాయి. భూత‌గాదాల‌తో రెండు కుటుంబాల మ‌ధ్య త‌లెత్తిన వివాద‌మే ఇరు వ‌ర్గాల మ‌ధ్య‌ ఘ‌ర్ష‌ణకు దారి తీసింద‌ని తెలిసింది.

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.