వారణాసి వీధుల్లో పానీ పూరీ లాగించిన స్మృతీ ఇరానీ

03-03-2021 Wed 09:48
  • వారణాసిలో పర్యటించిన స్మృతీ ఇరానీ
  • ఇష్టంగా పానీ పూరీలు తిన్న కేంద్ర మంత్రి
  • సెల్ఫీల కోసం పోటీ పడ్డ ప్రజలు
Smruthi Irani Eat Pani Poories in Varanasi

ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలో కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతీ ఇరానీ పర్యటిస్తున్న వేళ ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. సాధారణంగానే స్ట్రీట్ ఫుడ్ ను ఇష్టపడే స్మృతి, తనకు తారసపడిన ఓ పానీ పూరీ సెంటర్ కు వెళ్లి, పానీ పూరీలను లాగిస్తూ, మీడియా కంటపడ్డారు. దీంతో పానీ పూరీలు ఎలా ఉన్నాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, 'హరహర మహాదేవ్' అంటూ అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయారు.

రోడ్డుపై స్మృతీ ఇరానీని చూడగానే, పలువురు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆమె కూడా ఓపికతో ఫొటోలకు పోజులిచ్చారు. వారణాసిలో జరుగుతున్న బీజేపీ సమావేశాల నిమిత్తం ఆమె వచ్చారు. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు హాజరయ్యారు.