బెంగాల్‌లో అరాచక వాతావరణం: బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో యూపీ సీఎం ఫైర్

03-03-2021 Wed 08:57
  • దుర్గాపూజను నిషేధించి గోవధను ప్రారంభించారు
  • ‘జై శ్రీరామ్’ నినాదాన్ని కూడా నిషేధిస్తారేమో
  • ‘లవ్ జిహాద్’ను అడ్డుకోవడంలో మమత సర్కారు విఫలం
Yogi Adityanth Fires on Mamata Banerjee

విప్లవ భూమి అయిన పశ్చిమ బెంగాల్‌లో అరాచకం రాజ్యమేలుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నిన్న మాల్దాలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, మమత సర్కారుపై దుమ్మెత్తిపోశారు.

 దుర్గాపూజను నిషేధించిన ప్రభుత్వం, ఈద్ రోజున మాత్రం బలవంతంగా గోవధను ప్రారంభించిందని ఆరోపించారు. ఇప్పుడు ‘జై శ్రీరామ్’ నినాదాన్ని కూడా నిషేధించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గోవుల అక్రమ రవాణా, లవ్ జిహాద్‌లను అడ్డుకోవడంలో మమత సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు. కాగా, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల పోలింగ్ సమయాన్ని అరగంట పొడిగిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.