రూ. 5 కోట్లతో లగ్జరీ కారు కొన్న జూనియర్ ఎన్టీఆర్!

03-03-2021 Wed 08:31
  • లాంబోర్గినీ ఉరుస్ ను కొన్న ఎన్టీఆర్
  • త్వరలోనే ఇటలీ నుంచి దిగుమతి
  • ముచ్చటపడి కొన్నారంటున్న టాలీవుడ్
Junior NTR Buys A New Luxuary Car

మార్కెట్లోకి లగ్జరీ కార్లు వస్తే, వాటిని సొంతం చేసుకునేందుకు బడా వ్యాపారులు, సెలబ్రిటీలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తమ హోదా, అభిరుచికి తగ్గట్టుగా విదేశాల నుంచి కూడా వాహనాలను దిగుమతి చేసుకుంటుంటారు. తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్, ఇటలీకి చెందిన లాంబోర్గినీ తయారు చేసిన 'ఉరుస్' కారును కొన్నారట. త్వరలోనే ఇది ఇండియాకు దిగుమతి కానుంది. సూపర్ స్పోర్ట్స్ కారుగా లాంబోర్గినీ పరిచయం చేసిన ఈ కారు ధర రూ. 5 కోట్ల వరకూ ఉంటుంది. ఎన్టీఆర్ ఎంతో ముచ్చటపడి దీన్ని కొనుగోలు చేశారని సినీ వర్గాలు అంటున్నాయి.