University of Helsinki: ఇంటర్నెట్ అత్యధిక వినియోగానికి కారణం తెలిసింది!

  • ఒంటరితనం వల్లే ఇంటర్నెట్ అతి వినియోగం
  • కరోనా కారణంగా ఇంట్లో గడపడంతో ఒంటరితనం
  • దూరం చేసుకునేందుకు గేమ్స్, సోషల్ మీడియాపై దృష్టి
  • హెల్సింకీ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
Internet consumption in teenagers due to lonelyness

ఇంటర్నెట్ అత్యధిక వినియోగానికి కారణం తెలిసింది. ఒంటరితనాన్ని అనుభవించే కౌమారదశ పిల్లల్లో ఇంటర్నెట్ వినియోగం ఓ వ్యసనంగా మారుతోందని, ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరగడానికి ఇదే కారణమని ఫిన్లాండ్‌లోని హెల్సింకీ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కౌమారదశలో ఉన్న పిల్లల్లో అనేక కోరికలు ఉంటాయని, వారు బయట తిరగాలని, స్నేహితులతో ఆడుకోవాలని, వారితో ముచ్చటించాలని పరిశోధకులు పేర్కొన్నారు. కానీ కరోనా కారణంగా కాలేజీలు లేకపోవడం, ఇంట్లోనే ఉండాల్సి రావడంతో వారిలో ఒంటరితనం పెరిగిందని, దానిని దూరం చేసుకోవడానికి ఇంటర్నెట్‌ను అతిగా వాడేస్తున్నరని పరిశోధకులు తెలిపారు.

16 నుంచి 18 ఏళ్ల వయసున్న అబ్బాయిలు, అమ్మాయిల ఇంటర్నెట్ వినియోగంపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది.  ఈ వయసు పిల్లలు ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడుతూ, సామాజిక మాధ్యమాలు చూస్తూ గడిపేస్తున్నారని తేలింది. ఒంటరితనమే వారిని ఇంటర్నెట్‌కు దగ్గర చేస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, వయసు పెరిగే కొద్దీ మానసిక ఎదుగుదల కారణంగా ఇంటర్నెట్ వినియోగంపై స్వీయ నియంత్రణ పాటిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్నెట్ అతి వినియోగం డిప్రెషన్‌కు కారణమవుతుందని హెచ్చరించారు.

More Telugu News