రేవంత్ సైన్యం పేరిట బెదిరింపు మెసేజ్‌లు: షర్మిల ప్రధాన అనుచరుడు కొండా 

03-03-2021 Wed 07:49
  • రేవంత్ 14 ఏళ్లుగా ప్రజల కోసం పోరాడుతున్నారు
  • క్షమాపణలు చెప్పకపోతే భౌతికదాడులు తప్పవంటూ మెసేజ్
  • డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్న రాఘవరెడ్డి
warning messages to konda raghava reddy from revanth reddy sainyam

రేవంత్ సైన్యం పేరిట తనకు బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని వైఎస్ షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. భౌతిక దాడులు తప్పవంటూ వాట్సాప్‌లో తనకు వచ్చిన మెసేజ్‌ను మీడియాకు చూపించారు. ‘‘నమస్తే కొండా రాఘవరెడ్డి గారూ.. ఈ రోజు మీ ప్రెస్‌మీట్ విన్నాం. 14 ఏళ్లుగా రేవంత్‌రెడ్డి గారు ప్రజల  పక్షాన కొట్టాడుతున్న నాయకుడు. ప్రశ్నించే గొంతుగా ఆయనను ప్రజలు గెలిపించారు. అలాంటి నేతపై మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు నోరు అదుపులో పెట్టుకోండి. రేవంత్‌రెడ్డి గారికి తక్షణం క్షమాపణలు చెప్పకపోతే భౌతిక దాడులు తప్పవు’’ అని ఆ మెసేజ్‌లో హెచ్చరించారు. తనకు వచ్చిన హెచ్చరికలపై నేడు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు రాఘవరెడ్డి తెలిపారు.