సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

03-03-2021 Wed 07:24
  • పవన్ సినిమా నుంచి సాయిపల్లవి అవుట్ 
  • హైదరాబాదీ అమ్మాయిగా కృతి శెట్టి
  • 'పుష్ప'లో లేనంటున్న అనసూయ
Sai Pallavi out of Pawan Kalyan film

*  మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. ఇందులో కథానాయికగా సాయిపల్లవిని తీసుకున్నట్టుగా కూడా వార్తలొచ్చాయి. అయితే, తాజాగా సాయిపల్లవి ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. కారణాలు తెలియాల్సివుంది.
*  సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' పేరిట ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. ఇందులో కథానాయిక కృతిశెట్టి తెలంగాణ యాసలో మాట్లాడే హైదరాబాదీ అమ్మాయిగా నటిస్తోందట.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో హాట్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదనీ, తనకు పుష్ప నుంచి ఎటువంటి ఆఫర్ రాలేదనీ అనసూయ తాజాగా క్లారిటీ ఇచ్చింది.