ప్రమాదం నుంచి తప్పించుకున్న మమతా బెనర్జీ సోదరుడు

02-03-2021 Tue 21:42
  • లక్ష్మీకాంతపూర్ వెళుతున్న బాబున్ బెనర్జీ
  • కారును వెనుక నుంచి ఢీకొట్టిన వ్యాన్
  • సురక్షితంగా బయటపడ్డ బాబున్
  • కేసు నమోదు చేసిన పోలీసులు
CM Mamata Banarjee brother Babun escapes an accident

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు బాబున్ బెనర్జీ ఓ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కోల్ కతాలోని చింఘ్రిఘటా ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆయన కారును ఓ వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది.  ఆ వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో బాబున్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

అయితే బాబున్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బ్రేకు ఫెయిల్ కావడంతోనే కారును ఢీకొట్టానని ఆ ట్రక్కు డ్రైవర్ చెబుతున్నాడు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాబున్ బెనర్జీ లక్ష్మీకాంత పూర్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.