భానుప్రకాశ్ పై చేయి పడితే ఫాంహౌస్ పై చేయి వేయాల్సి ఉంటుంది: బండి సంజయ్

02-03-2021 Tue 20:34
  • ఉద్యోగాల భర్తీ కోరుతూ బీజేవైఎం మెరుపు ధర్నా
  • బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాశ్ అరెస్ట్
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్
  • లాలూ, కరుణానిధిలకు ఏం జరిగిందో కేసీఆర్ గుర్తుచేసుకోవాలని సూచన
Bandi Sanjay fires after police arrested BJYM leader Bhanuprakash

తెలంగాణ బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు భానుప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భానుప్రకాశ్ పై చేయి పడితే కేసీఆర్ ఫాంహౌస్ పై చేయి వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. భానుప్రకాశ్ ను వెంటనే విడుదల చేయాలని, ఇది తమ అభ్యర్ధన కాదని, వార్నింగ్ అని స్పష్టం చేశారు. ఓసారి లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధిలకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో కేసీఆర్ ఓసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే బాగుంటుందని అన్నారు. కేసీఆర్ కూడా జైలుకు వెళతాడని స్పష్టం చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ టీఎస్ పీఎస్ సీ కార్యాలయం వద్ద బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భానుప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.