భారత్ లో పిచ్ లను దారుణమైన రీతిలో హేళన చేసిన మైఖేల్ వాన్

02-03-2021 Tue 20:22
  • భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో స్పిన్ పిచ్ లదే హవా
  • వరుసగా రెండు టెస్టుల్లో టీమిండియా విజయం
  • జీర్ణించుకోలేకపోతున్న ఇంగ్లండ్ మాజీలు
  • భారత పిచ్ లపై తీవ్ర వ్యాఖ్యలు
England former skipper Michael Vaughan comments on fourth test preparations

భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు ఘోర పరాజయాలను ఎదుర్కోవడం ఆ దేశ మాజీ క్రికెటర్లకు మింగుడుపడడంలేదు. భారత్ లో పిచ్ లు విపరీతంగా స్పిన్ కు అనుకూలిస్తుండగా, తమ జట్టు చేతులెత్తేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వారు భారత పిచ్ లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా చేసిన పోస్టు దారుణంగా ఉంది.

'మట్టి పెళ్లలపై బ్యాటింగ్ చేస్తున్నట్టుగా పోజు ఇచ్చి... నాలుగో టెస్టు కోసం సన్నాహాలు జరుగుతున్నాయి' అంటూ ఎద్దేవా చేశాడు. మైఖేల్ వాన్ ఉపఖండపు పిచ్ లపై అక్కసు వెళ్లగక్కడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక పర్యాయాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా చేసిన పోస్టు వాన్ వైఖరికి పరాకాష్ఠ అని చెప్పే విధంగా ఉంది.