తెలంగాణ ట్రాన్స్ కో విభాగం సర్వర్లలో ప్రవేశించేందుకు చైనా హ్యాకర్ల యత్నాలు

02-03-2021 Tue 19:43

  • చైనా హ్యాకర్ల దాడులపై అప్రమత్తం చేసిన సీఈఆర్టీ
  • తెలంగాణ విద్యుత్ శాఖను లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడి
  • జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచన
  • ఐడీలు, పాస్ వర్డ్ లు మార్చేసిన విద్యుత్ శాఖ 
China Hackers tries to enter Telangana electricity computer systems

చైనా హ్యాకర్లు ఇటీవల తమ కార్యకలాపాలను విస్తృతం చేశారు. తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ సర్వర్లపై చైనా హ్యాకర్లు దాడులకు యత్నిస్తున్న విషయం వెల్లడైంది. తెలంగాణ విద్యుత్ శాఖకు ఈ మేరకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్లను చేరుకోవడానికి చైనా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అప్రమత్తం చేసింది. హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ శాఖ తమ కంప్యూటర్ వ్యవస్థల ఐడీలు, పాస్ వర్డ్ లను మార్చేసినట్టు తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ వెల్లడించారు.