ఏపీలో గడచిన 24 గంటల్లో 106 మందికి కరోనా నిర్ధారణ

02-03-2021 Tue 18:20
  • 35,804 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 33 కొత్త కేసులు
  • ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 57 మంది
  • యాక్టివ్ కేసుల సంఖ్య 774
AP Corona Update from Health Ministry

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 35,804 కరోనా పరీక్షలు చేపట్టగా 106 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా 33 కొత్త కేసులు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రంలో 57 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి మరణాలు సంభవించలేదు.

ఏపీలో ఇప్పటివరకు 8,90,080 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,137 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. ఇంకా 774 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 7,169 మంది మరణించారు.