చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు

02-03-2021 Tue 18:10
  • ఏపీలో ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికలు
  • ఈ నెల 4 నుంచి 8 వరకు చంద్రబాబు ప్రచారం
  • కర్నూలు జిల్లా నుంచి ప్రచారం ప్రారంభం
  • చివరగా గుంటూరు జిల్లాలో ప్రచారం
Chandrababu particates TDP campaign for Municipal Elections

ఏపీలో ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారానికి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తాజాగా ఆయన ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 4న కర్నూలు జిల్లాలో ప్రచారం షురూ చేస్తారు. అనంతరం ఈ నెల 5న చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. ఈ నెల 6న విశాఖ జిల్లాలో, ఈ నెల 7న విజయవాడలోనూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈ నెల 8న గుంటూరు జిల్లాలో పురపాలక ఎన్నికల ప్రచారంతో ఆయన పర్యటన ముగియనుంది.