చంద్రబాబు మళ్లీ సీఎం అవుతాడనే భయం జగన్ లో మొదలైంది: బుద్ధా వెంకన్న

02-03-2021 Tue 14:53
  • రేణిగుంటలో చంద్రబాబును అడ్డుకోవడం దారుణం
  • వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత వచ్చింది
  • చంద్రబాబు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
Jagan is afraid of Chandrababu says Budda Venkanna

రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయంలో తమ అధినేత చంద్రబాబును అడ్డుకోవడం దారుణమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. 20 నెలల పాలనలోనే వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత వచ్చిందని... మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారనే భయం జగన్ లో మొదలయిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలంతా వైసీపీ వెనుకే ఉన్నారని వైసీపీ నేతలు చెపుతున్నారని... అంత ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఎద్దేవా చేశారు.

వైసీపీని జనాలు ఆదరిస్తే టీడీపీని మూసేస్తామని చెప్పారు. టీడీపీ గెలిస్తే వైసీపీ దుకాణం మూసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. దుష్టశక్తులపై పోరాడే విషయంలో చంద్రబాబు వెనకడుగు వేయరని అన్నారు.