సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

02-03-2021 Tue 07:15
  • జూన్ 3న కీర్తి సురేశ్ 'గుడ్ లక్ సఖి'
  • సంక్రాంతి రేసులో నాగార్జున 'బంగార్రాజు'
  • ఎన్టీఆర్ సినిమాలో యంగ్ హీరో     
Keerti Suresh Good Luck Sakhi release date announced

*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర పోషించిన 'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని జూన్ 3న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేస్తున్నారు.
*  అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'బంగార్రాజు' చిత్రం షూటింగ్ జూన్ లో కానీ, జులైలో కానీ మొదలవుతుంది. ఈ విషయాన్ని నాగార్జున మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ, వచ్చే సంక్రాంతికి దీనిని రిలీజ్ చేస్తారని ఆయన చెప్పారు.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఓ కీలక పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. హీరోకి స్నేహితుడిగా ఇందులో అతను కనిపిస్తాడని అంటున్నారు. రాజకీయ కథాంశం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.