ఎన్నికల వేళ బీజేపీలో చేరిన బెంగాల్ సినీ తార

01-03-2021 Mon 22:25
  • పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • మమతను టార్గెట్ చేసిన బీజేపీ
  • వివిధ రంగాల ప్రముఖులకు పార్టీలోకి ఆహ్వానం
  • తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటి స్రబంతి ఛటర్జీ
Bengal actress Srabanti Chatterjee joins BJP

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పైనా, ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పైనా గత కొన్నాళ్లుగా తీవ్రస్థాయిలో పోరాటం సాగిస్తున్న బీజేపీ... ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకే విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులకు బెంగాల్ బీజేపీ తలుపులు తెరిచింది. ఈ క్రమంలో బెంగాలీ సినీ తార స్రబంతి ఛటర్జీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తన అందచందాలతో బెంగాల్ ప్రజలను సమ్మోహితులను చేసిన స్రబంతి ఇవాళ కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆమెకు పార్టీలోకి స్వాగతం పలికారు. స్రబంతి ఛటర్జీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, విభిన్న రంగాలకు చెందినవారు బీజేపీలోకి వస్తున్నారని ఘోష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.