'ఆచార్య' సెట్లో మెగా సందడి.. చిరంజీవి, రామ్ చరణ్ పై సన్నివేశాల చిత్రీకరణ

01-03-2021 Mon 20:54
  • చిరంజీవి, కొరటాల కలయికలో 'ఆచార్య' చిత్రం
  • శరవేగంగా సాగుతోన్న షూటింగ్
  • సెట్స్ పై అడుగుపెట్టిన రామ్ చరణ్
  • ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడంటూ కొరటాల ట్వీట్
  • ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నానన్న రామ్ చరణ్
Ram Charan on Acharya sets

చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం 'ఆచార్య'. ఇందులో రామ్ చరణ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో చిరంజీవి, రామ్ చరణ్ పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఈ ఫొటోను చిత్రబృందం పంచుకుంది. రామ్ చరణ్ భుజంపై చిరంజీవి చెయ్యేసిన దృశ్యం ఆ ఫొటోలో చూడొచ్చు.

ఈ ఫొటోపై దర్శకుడు కొరటాల శివ స్పందిస్తూ ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు అంటూ 'సిద్ధ' అనే పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ఆచార్య' చిత్రంలో రామ్ చరణ్ పాత్ర పేరు 'సిద్ధ' అని తెలిసిందే.

ఇక రామ్ చరణ్ కూడా ట్వీట్ చేశారు. కామ్రేడ్ మూమెంట్ అని పేర్కొన్నారు. తన తండ్రి చిరంజీవి, దర్శకుడు కొరటాల శివలతో సెట్స్ పై ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నానని తెలిపారు. మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్, కొణిదెల ప్రొ సంస్థలు 'ఆచార్య' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.