అనసూయ 'పైన పటారం' పూర్తి వీడియో గీతం విడుదల

01-03-2021 Mon 17:28
  • 'చావు కబురు చల్లగా' చిత్రంలో అనసూయ ఐటమ్ సాంగ్
  • జేక్స్ బెజోయ్ సంగీతంలో పక్కా మాస్ సాంగ్
  • ఇటీవలే ప్రోమో రిలీజ్
  • పూర్తి పాటను అందించిన చిత్ర యూనిట్
  • మార్చి 19న రిలీజ్ కానున్న 'చావు కబురు చల్లగా'
 Anasuya starred Paina Pataram item song out now

రంగస్థలం సినిమా నుంచి అనసూయ జోరు మామూలుగా లేదు. టీవీ యాంకరింగ్ కంటే మిన్నగా సినిమాల్లో అవకాశాలు పొందుతూ కెరీర్ పరంగా దూసుకెళుతోంది. తాజాగా 'చావు కబురు చల్లగా' చిత్రంలో అనసూయ "పైన పటారం.. లోన లొటారం" అంటూ సాగే మాస్ ఐటమ్ సాంగ్ లో ఎంతో హుషారుగా స్టెప్పులేసింది. ఇటీవల ఈ ఐటమ్ సాంగ్ ప్రోమో విడుదల చేసిన చిత్రబృందం తాజాగా పూర్తి పాట వీడియోను రిలీజ్ చేసింది. జేక్స్ బెజోయ్ బాణీలకు సానారే సాహిత్యం అందించారు. మంగ్లీ, సాకేత్ కొమాండూరి ఆలపించారు.

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో వస్తున్న 'చావు కబురు చల్లగా' చిత్రంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. ఆమని, మురళీశర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.