చంద్రబాబును ఎవరూ అరెస్ట్ చేయలేదు... ఆయనకు ఎలాంటి అవమానం జరగలేదు: మంత్రి పెద్దిరెడ్డి

01-03-2021 Mon 17:05
  • ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
  • రేణిగుంటలో నిలిచిపోయిన చంద్రబాబు
  • టీడీపీ నేతల మండిపాటు
  • చంద్రబాబు దీక్ష నిబంధనలకు విరుద్ధమన్న మంత్రి పెద్దిరెడ్డి
Peddireddy says nobody arrest Chandrababu

తిరుపతిలో నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబును రేణిగుంట ఎయిర్ పోర్టులో పోలీసులు నిలువరించడంపై టీడీపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. దీనిపై ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబును ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఆయనకు ఎలాంటి అవమానం జరగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేస్తానన్న దీక్ష నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఓవైపు కరోనా ఆంక్షలు, మరోవైపు ఎన్నికల కోడ్ వల్ల దీక్ష చేపట్టడం కుదరదని పేర్కొన్నారు.

కొవిడ్ వ్యాప్తి, ఎన్నికల కోడ్ కారణంగా పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ముందే చెప్పారని వివరించారు. ఆరోగ్యరీత్యా చంద్రబాబు వెంటనే వెనుదిరిగి వెళ్లిపోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ఈ పరిస్థితుల్లో పోలీసులను చంద్రబాబు ఇబ్బందిపెట్టవద్దని కోరుతున్నాం అని వ్యాఖ్యానించారు.