భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

01-03-2021 Mon 15:44
  • 749 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 232 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 6.47 శాతం పెరిగిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్
Sensex closes 749 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. మన దేశ ఆర్థిక వృద్ధి రేటు పెరగడం, ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 749 పాయింట్లు లాభపడి 49,850కి చేరుకుంది. నిఫ్టీ 232 పాయింట్లు పెరిగి 14,762కి ఎగబాకింది. టెలికాం మినహా మిగిలిన అన్ని సూచీలు ఈరోజు  లాభపడ్డాయి. ఇన్ఫ్రా సూచీ అత్యధికంగా 3.66 శాతం పెరిగింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (6.47%), ఓఎన్జీసీ (5.71%), అల్ట్రాటెక్ సిమెంట్ (4.30%), ఏసియన్ పెయింట్స్ (4.02%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.62%). సెన్సెక్స్ లో కేవలం భారతి ఎయిల్ టెల్ (4.44%) మాత్రమే నష్టపోయింది.