Nara Lokesh: ప్రతిపక్ష నేత ఇంటికి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు: సీఎం జగన్ పై నారా లోకేశ్ ఆగ్రహం

Nara Lokesh fires in YS Jagan after TDP Chief Chandrababu detained in Renigunta airport
  • చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు
  • ఎయిర్ పోర్టులో అడ్డుకున్న పోలీసులు
  • పిరికి పాలకుడు జగన్ అంటూ విమర్శలు
  • ఈ అరాచకాలు ఇంకెన్నాళ్లని మండిపాటు
  • జగన్ రెడ్డి పతనానికి నాంది అంటూ వ్యాఖ్యలు
చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడంపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిరికి పాలకుడు జగన్ అరాచకాలు ఇంకెన్నాళ్లు? అంటూ మండిపడ్డారు. 2019లో పల్నాడు వెళ్లకుండా ఇంటి గేటుకు తాళ్లు కట్టి అడ్డుపడ్డారని, 2020లో విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయటికి రాకుండా చుట్టుముట్టారని ఆరోపించారు. ఇప్పుడు రేణిగుంట ఎయిర్ పోర్టులో నిర్బంధించారని వివరించారు.

"ప్రతిపక్ష నేత ఇంటి గేటుకు కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లవుతాయి" అని హెచ్చరించారు. డెమోక్రసీని జగనోక్రసీతో అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష నేత హక్కులు హరిస్తున్న ప్రతి సంఘటన జగన్ రెడ్డి పతనానికి నాంది కాబోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పష్టం చేశారు.
Nara Lokesh
Jagan
Chandrababu
Renigunta Airport
Telugudesam
Andhra Pradesh

More Telugu News