కొరటాల సినిమాలో వరలక్ష్మి కీలక పాత్ర?

01-03-2021 Mon 12:32
  • కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ 
  • 'ఆచార్య', 'పుష్ప'ల తర్వాత సెట్స్ కు
  • స్టూడెంట్ లీడర్ పాత్రలో అల్లు అర్జున్
  • మరో పవర్ ఫుల్ రోల్ లో వరలక్ష్మి
Varalakshmi to play key role in Koratala Shiva movie

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ దీని తర్వాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది కూడా. ప్రస్తుతం స్కిప్టు పని కూడా ఓపక్క జరుగుతోంది. ప్రస్తుతం తాను చిరంజీవి, రామ్ చరణ్ లతో చేస్తున్న 'ఆచార్య' చిత్రం పూర్తయిన వెంటనే దర్శకుడు కొరటాల ప్రాజక్టుపై పూర్తిగా దృష్టి పెడతారు.

ఈ క్రేజీ ప్రాజక్టులో అల్లు అర్జున్ మొదట్లో స్టూడెంట్ లీడర్ గానూ.. తదనంతర దశలో రాజకీయ నాయకుడిగానూ ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రను పోషించనుందని తెలుస్తోంది. ఆమెది కూడా చాలా పవర్ ఫుల్ పాత్ర అని అంటున్నారు. ఇటీవల వచ్చిన 'క్రాక్', 'నాంది' సినిమాలలో కీలక పాత్రలు పోషించిన వరలక్ష్మి నటిగా మరోసారి తన సత్తా చాటారు.