Narendra Modi: 'అంద‌రూ వేయించుకోవాలి'.. వ‌్యాక్సిన్ వేయించుకున్న త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు మోదీ సందేశం

  • ఎయిమ్స్‌లో క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నా
  • వైద్యులు, శాస్త్ర‌వేత్త‌లు క‌రోనాపై పోరాడుతున్నారు
  • అంద‌రం క‌లిసి భార‌త్‌ను క‌రోనా ర‌హిత దేశంగా మార్చుదాం
modi praises doctors

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై ట్విట్ట‌ర్ ద్వారా మోదీ స్పందిస్తూ.. ఎయిమ్స్‌లో క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నానని చెప్పారు. క‌రోనాపై పోరాడుతోన్న వైద్యులు, శాస్త్ర‌వేత్త‌ల‌ను ఆయ‌న కొనియాడారు.

క‌రోనాను అంత‌మొందించ‌డానికి వారు వేగంగా కృషి చేస్తున్నార‌ని చెప్పారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా వ్యాక్సిన్ ను వేయించుకోవాల‌ని తెలిపారు. అంద‌రం క‌లిసి భార‌త్‌ను క‌రోనా ర‌హిత దేశంగా మార్చుదామ‌ని పిలుపునిచ్చారు. అంద‌రూ వ్యాక్సిన్ తీసుకుని ఈ ల‌క్ష్యాన్ని ఛేదిద్దామ‌ని తెలిపారు.

కాగా, మోదీ ఈ రోజు భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను వేయించుకున్నారు. ఆ  సమయంలో ఆయ‌న‌ అసోంలో తయారు చేసిన కండువాను ధరించి క‌న‌ప‌డ్డారు. పుదుచ్చేరికి చెందిన పి.నివేద అనే న‌ర్సు మోదీకి వ్యాక్సిన్ వేసే విధి నిర్వ‌ర్తించారు. మోదీకి ఎడ‌మ చేతికి వ్యాక్సిన్ వేశారు. ఆ సమయంలో కేరళకు చెందిన మరోనర్సు రోశమ్మ అనిల్ కూడా అక్కడే వున్నారు.

More Telugu News