కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని నరేంద్రమోదీ

01-03-2021 Mon 07:49
  • ఢిల్లీలోని ఎయిమ్స్‌లో టీకా వేయించుకున్న ప్రధాని
  • టీకా ఇచ్చిన సిస్టర్ నివేదా
  • దేశాన్ని కొవిడ్ రహితంగా తీర్చిదిద్దుదామన్న ప్రధాని
PM Modi took Corona Vaccine in AIIMS

దేశంలో నేడు కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను ప్రధానికి వేశారు. ఎయిమ్స్ సిస్టర్ పి.నివేదా సిరంజి ద్వారా మోదీకి టీకా ఇచ్చారు. తాను కరోనా టీకా తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మోదీ.. అందరం కలిసి దేశాన్ని కొవిడ్ రహితంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.