సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

01-03-2021 Mon 07:20
  • విలన్ గా చేయాలనుందంటున్న లావణ్య 
  • జులై నుంచి ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా
  • రామ్, పూరి కాంబోలో మరో ప్రాజక్టు  
Lavanya says she wants to do villain roles

*  విలన్ గా చేయాలనుంది అంటోంది కథానాయిక లావణ్య త్రిపాఠి. "మన సత్తా బయటకు రావాలంటే విలన్ తరహా పాత్రలు చేయాలి. అందుకే అలాంటి పాత్రల కోసం చూస్తున్నాను. వస్తే కనుక వదిలేది లేదు' అని చెబుతోంది లావణ్య.
*  ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్' చిత్రాలలో నటిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వైజయంతీ మూవీస్ నిర్మించే భారీ చిత్రంలో కూడా నటించనున్న సంగతి విదితమే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ జులై నెల నుంచి జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తోంది.
*  ఎనర్జిటిక్ హీరో రామ్, పూరి జగన్నాథ్ కలయికలో ఆమధ్య 'ఇస్మార్ట్ శంకర్' హిట్ సినిమా వచ్చిన సంగతి విదితమే. మళ్లీ వీరిద్దరి కలయికలో త్వరలో మరో చిత్రం రానుంది. ప్రస్తుతం తాను చేస్తున్న 'లైగర్' తర్వాత రామ్ తో చేసే ప్రాజక్టును పూరి చేబడతాడని తెలుస్తోంది.