వామనరావు దంపతుల హత్య కేసు.. రామగిరి పోలీసులకు క్లీన్ చిట్!

01-03-2021 Mon 07:08
  • సంచలనం సృష్టించిన వామనరావు దంపతుల హత్య
  • రామగిరి పోలీసుల సహకారం ఉందని ఆరోపణలు
  • అలాంటిదేమీ లేదని విచారణలో తేలిన వైనం
there is no evidence in about ramagiri police hand in double murder case

సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్య కేసులో విచారణ చురుగ్గా సాగుతోంది. ఈ జంట హత్యల కేసులో పెద్దపల్లి జిల్లాలోని రామగిరి పోలీసుల ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలు దుమారం రేపాయి. దీంతో స్పందించిన డీజీపీ మహేందర్‌రెడ్డి ఐజీ నేతృత్వంలో అంతర్గత విచారణ జరిపించారు. విచారణలో ఆ ఆరోపణలు అవాస్తవమని తేలింది.

వామనరావు దంపతుల హత్యకు రామగిరి పోలీసుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని, ఆ హత్యలకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో తేలడంతో రామగిరి పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే, ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణ నుంచి మాత్రం వారిని దూరం పెట్టారు.