Sticky Bombs: కశ్మీర్లో కలవరం రేకెత్తిస్తున్న 'అతికించే బాంబులు'

  • ఆఫ్ఘనిస్థాన్ లో విధ్వంసానికి కారణమవుతున్న అతికించే బాంబులు
  • ఇప్పుడు కశ్మీర్ లోనూ ఈ తరహా బాంబులు
  • ఇటీవల భద్రతా దళాల దాడుల్లో ఈ బాంబులు లభ్యం
  • అయస్కాంతం సాయంతో వాహనాలకు అతికించే సౌలభ్యం
Sticky Bombs appears in Kashmir

ఉగ్రవాదుల కార్యకలాపాలు అధికంగా ఉండే కశ్మీర్ లో భద్రతా బలగాలకు ఇప్పుడో కొత్త సవాలు ఎదురవుతోంది. ఆఫ్ఘనిస్థాన్ లో తీవ్ర విధ్వంసానికి కారణమవుతున్న ఈ అతికించే బాంబులు (స్టికీ బాంబులు) ఇప్పుడు కశ్మీర్లోనూ కలకలం రేపుతున్నాయి. ఈ బాంబులు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. వీటిని ఓ అయస్కాంతం సాయంతో వాహనాలకు, ఇతర లోహపు వస్తువులకు అతికించవచ్చు. దూరంగా ఉండి వీటిని పేల్చవచ్చు. తద్వారా అధిక బీభత్సం సృష్టించడమే కాకుండా, ఉగ్రవాదులు క్షేమంగా తప్పించుకునే వీలుంటుంది.

గత కొన్నినెలలుగా జమ్మూ కశ్మీర్ లో జరిపిన అనేక సోదాల్లో ఈ అతికించే బాంబులు లభ్యమయ్యాయని సీనియర్ భద్రతాధికారులు వెల్లడించారు. ఇవి చాలా చిన్నవిగా కనిపించే ఐఏడీ బాంబులని, కానీ ఎంతో శక్తిమంతమైనవని కశ్మీర్ లోయ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ వివరించారు. ఈ తరహా బాంబులు కశ్మీర్లో భద్రతా బలగాల కదలికలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ తిరుగుబాటుదారులు ప్రారంభించిన ఈ అతికించే బాంబులు క్రమంగా భారత్, పాక్ సరిహద్దులకు చేరాయి. ఆఫ్ఘనిస్థాన్ లో అతికించే బాంబులు ఉపయోగించి భద్రతా దళాలను, జడ్జిలను, ప్రభుత్వ అధికారులను, సామాజిక ఉద్యమకారులను, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. ఈ బాంబులను పాకిస్థాన్ నుంచి డ్రోన్లు, సొరంగ మార్గాల ద్వారా కశ్మీర్ కు తరలిస్తున్నట్టు విజయ్ కుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News