వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రభాస్ 'సలార్'

28-02-2021 Sun 15:59
  • ప్రభాస్, శృతి హాసన్ జంటగా సలార్
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రం
  • హోంబలే ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న విజయ్ కిరంగదూర్
  • షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం
Prabhas starred Salaar set to release in April

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'సలార్' 2022 ఏప్రిల్ 14న విడుదల కానుంది. చిత్రబృందం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' చిత్రం ప్రస్తుతం రామగుండం వద్ద బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటోంది. పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బొగ్గుగనుల్లో పనిచేసే యువకుడి పోరాటమే 'సలార్' చిత్ర కథాంశం అని ప్రచారం జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆలిండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడం, కేజీఎఫ్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ భారీ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో... ఈ కాంబోలో వస్తున్న 'సలార్' పై అంచనాలు అధికమవుతున్నాయి.