Nathan Lyon: పిచ్​ పై స్పిన్​ తిరిగితే చాలు ప్రపంచం మొత్తం ఏడుస్తుంది: ఆస్ట్రేలియా స్టార్​ స్పిన్నర్​ మండిపాటు

  • పేస్ పిచ్ ల గురించి ఎందుకు మాట్లాడరంటూ నిలదీసిన నాథన్ లైయన్
  • ఇండియా–ఇంగ్లండ్ మూడో టెస్టుపై కామెంట్
  • మ్యాచ్ మొత్తాన్ని ఎంజాయ్ చేశానన్న లైయన్
Nathan Lyon slams Ahmedabad pitch critics  When it starts spinning the world starts crying

అహ్మదాబాద్ లోని మొతేరా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో స్పిన్  ఉచ్చులో చిక్కుకుని ఇంగ్లండ్ కుప్పకూలింది. రెండు రోజులకే ఆట పూర్తయింది. దీంతో ఇంగ్లండ్ మాజీ ఆటాగాళ్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్ లు విమర్శలు గుప్పించారు. అది అసలు టెస్ట్ పిచ్ కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై భారత దిగ్గజాలు సహా పలు అంతర్జాతీయ ఆటగాళ్లు ఇంగ్లండ్ ప్లేయర్ల వైఖరిపై మండిపడ్డారు. ఆ జాబితాలో తాజాగా నాథన్ లైయన్ చేరాడు.

పిచ్ లు స్పిన్ కు అనుకూలించినప్పుడే ప్రపంచం మొత్తం ఏడుపులు మొదలుపెడుతుందని మండిపడ్డాడు. తాము ప్రపంచంలో పేస్ వికెట్ పై ఆడి 47 లేదా 60 పరుగులకు ఆలౌట్ అయినప్పుడు నోరెందుకు లేవలేదని నిలదీశాడు.

ఎవ్వరైనా ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించాడు. కానీ, ఎప్పుడైతే పిచ్ స్పిన్ తిరుగుతుందో అప్పుడే విమర్శలతో రెడీగా ఉంటారని విమర్శించాడు. తాను ఆ మ్యాచ్ మొత్తం చూశానని, చాలా ఎంజాయ్ చేశానని లైయన్ చెప్పాడు. ఆ పిచ్ ను తయారు చేసిన క్యురేటర్ ను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్ సీజీ)కి తీసుకురావాలనుకుంటున్నానని చెప్పాడు.

పేస్ కు కుప్పకూలితే...

మాజీ భారత స్పిన్నర్, హైదరాబాదీ ప్రజ్ఞాన్ ఓఝా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లపై మండిపడ్డాడు. ‘‘మీ స్టువర్ట్ బ్రాడ్ 15 పరుగులకే 8 వికెట్లు తీసినప్పుడు ఎటు పోయాయ్ మీ మాటలు? అది ఎలాంటి పిచ్? పిచ్ పై గడ్డి ఉండి.. పేస్ బౌలింగ్ కు అనుకూలించి.. మ్యాచ్ రెండు మూడు రోజుల్లో పూర్తయిపోతే చాలా మంచిదంటారు.. స్పిన్ తిరిగి రెండ్రోజుల్లోనే ముగిస్తే మాత్రం పిచ్ బాగాలేదంటారు.. టెస్ట్ వికెట్ కాదంటారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

More Telugu News