Viral Videos: క‌న్నీరు పెట్టిస్తోన్న ఫుడ్ డెలివ‌రీ బాయ్ వీడియో!

  • విధుల‌ నిర్వ‌హ‌ణ‌లో ఎదుర‌వుతోన్న‌ క‌ష్టాలను చెప్పిన డెలివ‌రీ బాయ్
  • ఖ‌ర్చులు పోనూ ఏమీ మిగ‌ల‌ట్లేద‌ని క‌న్నీరు
  • టిప్పులు కూడా ఇవ్వ‌ట్లేద‌ని ఆవేద‌న‌
food delivery boy video goes viral

త‌న విధుల నిర్వ‌హ‌ణ‌లో ఎదుర‌వుతోన్న‌ క‌ష్టాలను చెప్పుకుంటూ ఓ డెలివ‌‌రీ బాయ్ తీసుకున్న ఓ వీడియో ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది. ఉబర్‌ ఈట్స్ కు చెందిన రిలే ఎల్లియోట్‌ డెలివరీ బాయ్‌ త‌న వాహ‌నంలోనే కూర్చొని క‌న్నీరు కార్చుతూ ఈ వీడియో తీసుకుని పోస్ట్ చేశాడు.

ఈ వీడియో చూస్తోన్న వారంద‌రూ మా డెలివరీ డ్రైవర్లను తప్పకుండా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాన‌ని చెప్పాడు. ఫుడ్ ఆర్డ‌ర్ చేసిన ఓ వ్య‌క్తి దాన్ని‌ తీసుకోవడానికి ఓ వ్యక్తి అపార్ట్ మెంటు పై అంత‌స్తు నుంచి కిందకు రాలేదని చెప్పాడు. ఆయ‌న ఆల‌స్యం చేయ‌డం, ఆయ‌న‌కు ఆ డెలివరీ ఇవ్వడానికి 45 నిమిషాలు పట్టింద‌ని తెలిపాడు.

ఆర్డ‌ర్ అందించ‌డానికి త‌న‌కు మూడు డాలర్లు ఖర్చయ్యాయని, అయితే, ఆయ‌న త‌న‌కు ఒకటిన్నర డాలర్ల టిప్పు మాత్ర‌మే ఇచ్చాడని చెప్పాడు. దానితో పాటు  ఈ డెలివరీ చేసినందుకు ఉబర్ త‌నకు రెండున్నర డాలర్లు మాత్రమే ఇస్తుందని చెప్పాడు. దీంతో ఆర్డ‌ర్ చేయ‌డానికి త‌నకు అయిన ఖ‌ర్చుపోగా త‌న‌కు మిగిలేది కొంచ‌మేన‌ని తెలిపాడు.

చాలా స‌మ‌యం కూడా వృథా అవుతుంద‌ని చెప్పాడు. నిద్ర మానుకుని ఈ జాబ్ చేసుకుంటున్నాన‌ని, అయినా క‌స్ట‌మ‌ర్లు త‌న‌పై జాలి చూప‌ర‌ని టిప్పులు ఇవ్వ‌ర‌ని తెలిపాడు. తాము కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నా త‌మ‌ని ఎవ్వరూ ప‌ట్టించుకోర‌ని అన్నాడు. ఆయ‌న వీడియో సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ కావ‌డంతో ఆయ‌న‌పై నెటిజ‌న్లు జాలి క‌న‌బ‌ర్చుతున్నారు. ఆయ‌నకు కొంద‌రు న‌గ‌దు సాయం చేస్తున్నారు.

More Telugu News