స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. షెఫాలీపై వేటు, తెలుగమ్మాయికి చోటు!

28-02-2021 Sun 08:56
  • టీ20ల్లో అదరగొడుతున్నా షెఫాలీకి దక్కిన చోటు
  • వేదకృష్ణమూర్తి, శిఖాపాండేలకు రెండు ఫార్మాట్లలోనూ దక్కని చోటు
  • టీ20 జట్టులో చోటు దక్కించుకున్న అరుంధతిరెడ్డి
  • మార్చి ఏడు నుంచి వన్డే సిరీస్
Telugu girl Arundhati Reddy selected for India T20 team

వచ్చే నెలలో స్వదేశంలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లో పోరాడే భారత మహిళల జట్టును బీసీసీఐ నిన్న ప్రకటించింది. అనూహ్యంగా యువ బ్యాట్స్ విమెన్ షెఫాలీ వర్మకు చోటు దక్కకపోవడం గమనార్హం. టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న షెఫాలీకి చోటు దక్కకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వన్డే జట్టుకు మిథాలీ రాజ్, టీ20 జట్టుకు హర్మన్‌ప్రీత్‌ సారథ్యం వహించనున్నారు.

ఝులన్ గోస్వామి, స్మృతి మంధాన, దీప్తిశర్మ లాంటి సీనియర్లతోపాటు యువ పేసర్లు ప్రత్యూష, మోనికా పటేల్‌కు చోటు దక్కింది. ఇక, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న వేద కృష్ణమూర్తి, వెటరన్ పేసర్ శిఖాపాండేపై సెలక్షన్ బృందం వేటువేసింది. రెండు ఫార్మాట్లలోనూ వీరికి చోటు లభించలేదు.

ఇక టీ20 జట్టులో తెలుగమ్మాయి అరుంధతిరెడ్డికి చోటు దక్కింది. యువ సీమర్ సిమ్రన్ దిల్ బహుదూర్‌ తొలిసారి జట్టులో స్థానంలో దక్కించుకుంది. వికెట్ కీపర్లు శ్వేతవర్మ, సుష్మావర్మలు రెండు ఫార్మాట్లకు ఎంపికయ్యారు. లక్నోలోని వాజ్‌పేయి స్టేడియంలో మార్చి ఏడో తేదీ నుంచి వన్డే సిరీస్, 20న టీ20 సిరీస్ ప్రారంభమవుతాయి.